రతన్ టాటా కారు నెంబరును తన కారుకు వాడుతూ పట్టుబడిన మహిళ!

  • సెలబ్రిటీల కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు
  • సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముకున్న ముంబయి మహిళ
  • కలిసొచ్చిన నెంబరు అంటూ నకిలీ ప్లేటు వాడుతున్న వైనం
  • ఆ నెంబరు రతన్ టాటాదని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు
ప్రముఖుల వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయని తెలిసిందే. అయితే, సంఖ్యాశాస్త్రంపై నమ్మకం ఉన్న ఓ మహిళ తనకు అచ్చొచ్చిన అంకెలతో కూడిన నెంబరు ప్లేట్ ను తన కారుకు తగిలించి అడ్డంగా బుక్కయిపోయింది. ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ముంబయి ట్రాఫిక్ పోలీసులు ఓ తెల్ల బీఎండబ్ల్యూ కారును ఆపారు.

ఆ కారుకు ఫ్యాన్సీ నెంబర్ ఉండడంతో లోతుగా పరిశీలించి విస్మయానికి గురయ్యారు. ఆ నెంబరు భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా కారుకు చెందినది. ఆ నెంబరు ఆయన పేరిటే నమోదై ఉన్నట్టు గుర్తించారు. కాకపోతే తనకు కలిసొచ్చిన నెంబరు అంటూ ఆ మహిళ తన బీఎండబ్ల్యూ కారుకు రతన్ టాటా కారు నెంబరు తగిలించుకుంది. కానీ చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఆ మహిళపై ముంబయి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.


More Telugu News