ప్ర‌జ‌ల‌కు ప్ర‌ముఖుల భోగి శుభాకాంక్ష‌లు.. తెలుగులో మోదీ ట్వీట్

  • ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్న వెంక‌య్య నాయుడు
  • భోగి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలి:  మోదీ
  • ఈ భోగి మంట‌ల్లో అన్ని అరిష్టాలు అంతం కావాలి: కేసీఆర్‌
  • తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలి: జ‌గ‌న్
ప్ర‌జ‌ల‌కు ప‌లువురు నేత‌లు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు పండుగ‌ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలుగులో ప్ర‌ధాని మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. 'అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను' అని మోదీ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. 'ఈ భోగి మంట‌ల్లో అన్ని అరిష్టాలు అంతం కావాల‌ని.. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు భోగ‌భాగ్యాల‌తో, ఆయురారోగ్యాల‌తో విల‌సిల్లాల‌ని ఆకాంక్షిస్తున్నాను' అని చెప్పారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గన్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. 'రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను' అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  ప్ర‌జ‌ల‌కు బీజేపీ నేత సునీల్ దేవధర్ కూడా భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు.


More Telugu News