బెస్ట్ సీఎం సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మూడోస్థానం

  • సర్వే నిర్వహించిన ఏబీసీ, సీ-ఓటర్
  • 'దేశ్ కా మూడ్' పేరిట సర్వే
  • తొలి రెండు స్థానాల్లో నవీన్ పట్నాయక్, కేజ్రీవాల్
  • టాప్-3లో నిలిచిన ఏపీ సీఎం
ఏపీ సీఎం జగన్ దేశంలో బెస్ట్ సీఎంల జాబితాలో టాప్-3లో నిలిచారు. ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో సీఎం జగన్ కు మూడో స్థానం లభించింది. 'దేశ్ కా మూడ్' పేరిట ఏబీసీ, సీ-ఓటర్ సంస్థలు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అత్యుత్తమ రీతిలో పాలన అందిస్తున్న సీఎంలు ఎవరంటూ ఏబీసీ, సీ-ఓటర్ సంస్థలు జాతీయస్థాయిలో సర్వే నిర్వహించాయి. సంక్షేమ పథకాల అమలు, సమర్థవంతమైన పాలన ప్రాతిపదికగా ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేశాయి.

ఈ జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నెంబర్ వన్ స్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పట్టం కట్టారు. ఆ తర్వాత స్థానంలో ఏపీ సీఎం జగన్ ఉన్నారు. ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ నిలిచారు. ఆయనకంటే ఒక స్థానంపైన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ కు చోటుదక్కింది.


More Telugu News