ఆచార్య సినిమాలో రామ్ చ‌ర‌ణ్ లుక్ విడుద‌ల‌

  • మెగాస్టార్‌ చిరంజీవి  హీరోగా ఆచార్య
  • మెడలో రుద్రాక్ష, చెవికి పోగుతో చెర్రీ
  • సిద్ధా పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్‌
మెగాస్టార్‌ చిరంజీవి న‌టిస్తోన్న ఆచార్య సినిమా నుంచి రామ్ చ‌ర‌ణ్ తేజ్ కు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను ఆ సినిమా బృందం విడుద‌ల చేసింది. ఈ సినిమాలో చెర్రీ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీన్ని క‌న్ఫార్మ్ చేసింది ఆ సినిమా యూనిట్. రామ్ చరణ్ ఎన్న‌డూ లేని విధంగా కొత్త లుక్‌లో మెడలో రుద్రాక్ష, చెవికి పోగుతో క‌న‌ప‌డుతున్నాడు.  

సిద్ధా అనే పాత్రలో ఆయ‌న న‌టిస్తున్నాడ‌ని ఈ సినిమా బృందం తెలిపింది. ‘ఆచార్య’ సెట్‌లోకి ఆయ‌న‌కు స్వాగతం పలుకుతున్నామ‌ని చెప్పింది.  "మా  సిద్ధా సర్వం సిద్ధం" అంటూ ఈ సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా ఈ పోస్ట‌ర్ ను పోస్ట్ చేశారు. కాగా, ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ న‌టిస్తోంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.




More Telugu News