దేశంలో 41.6 కోట్లకు చేరిన జన్‌ధన్ ఖాతాల లబ్ధిదారుల సంఖ్య
- 2014లో స్వాతంత్య్ర దినోత్సవాన ప్రారంభించిన మోదీ
- గణనీయంగా తగ్గిన జీరో ఖాతాలు
- 2018లో పీఎంజేడీవై 2.0ను ప్రారంభించిన కేంద్రం
2014లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నెల ఆరో తేదీ నాటికి దేశంలో జన్‌ధన్ ఖాతాల లబ్ధిదారుల సంఖ్య 41.6 కోట్లకు చేరుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, వీటిలో జీరో ఖాతాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు పేర్కొంది. 2015లో జీరో ఖాతాల సంఖ్య 58 శాతంగా ఉండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 7.5 శాతానికి దిగొచ్చినట్టు వెల్లడించింది.
2018లో ఈ పథకానికి మరిన్ని మెరుగులద్దిన కేంద్రం ‘పీఎంజేడీవై 2.0’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 28 ఆగస్టు 2018 తర్వాత జన్‌ధన్ ఖాతాలు తెరిచిన వారికి రూపేకార్డులపై ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ప్రమాద బీమాను రూ. 2 లక్షలకు పెంచింది. ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) పరిమితిని డబుల్ చేసి రూ. 10 వేలకు పెంచింది.