సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • 'గ్యాంగ్ లీడర్' భామకు భారీ ఆఫర్ 
  • 'ఆచార్య' కోసం ముగ్గురి కాంబో సీన్స్  
  • ప్రభాస్ కు విలన్ గా విజయ్ సేతుపతి
*  ఆమధ్య నాని సరసన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో కథానాయికగా నటించిన ప్రియాంక అరుల్ మోహన్ కోలీవుడ్ లో భారీ ఆఫర్ అందుకుంది. అగ్రహీరో సూర్య సరసన నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మకు వచ్చింది. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించే సినిమాలో కథానాయిక పాత్రకు తాజాగా ప్రియాంకను తీసుకున్నట్టు తెలుస్తోంది.
*  మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత కొన్నాళ్లుగా హైదరాబాదులో జరుగుతోంది. ఈ క్రమంలో త్వరలో చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చరణ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా, చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది.
*  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో ముహూర్తాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో విలన్ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


More Telugu News