ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న ప్రాథమిక పాఠశాలలు

  • 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు క్లాసులు
  • కొవిడ్ ప్రోటోకాల్ కు అనుగుణంగా తరగతులు
  • విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా నిర్వహణ
  • తరగతి గదిలో 20 మంది విద్యార్థులకే అనుమతి
  • తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీ తప్పనిసరి
ఏపీలో వచ్చే నెల నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న తరగతి గదుల ఆధారంగా పాఠశాలల నిర్వహణ ఉంటుందని తెలిపారు.

ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. గదులు సరిపోని చోట ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపడతామని వివరించారు. తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే విద్యార్థులకు అనుమతి ఉంటుందని అన్నారు.


More Telugu News