బెండకాయ, దొండకాయ, నువ్వు నా గుండెకాయ అంటూ బన్నీకి చెప్పిన‌ అర్హ.. వీడియో ఇదిగో

  • 'పుష్ప' సినిమాలో న‌టిస్తోన్న బ‌న్నీ
  • షూటింగ్ కోసం వెళ్లిన అల్లు అర్జున్
  • అర్హ‌ను మిస్ అవుతున్నాన‌ని పోస్ట్
  • బ‌న్నీ వెళ్లే స‌మ‌యంలో క్యూట్ డైలాగ్ చెప్పిన అర్హ
సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం  'పుష్ప' సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో ఆయ‌న షూటింగ్ నిమిత్తం కేర‌ళ‌కు వెళ్తుండ‌గా ఆయ‌న కూతురు అర్హ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను బ‌న్నీ పోస్ట్ చేశాడు.

ఇందులో అర్హ‌ ‘బెండకాయ, దొండకాయ, నువ్వు నా గుండెకాయ’ అంటూ బన్నీకి చెప్పింది. ‘ఐ మిస్‌ యూ అర్హ’ అంటూ అల్లు అర్జున్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. కాగా, ‘పుష్ప’ సినిమా అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోంది.

ఈ నేప‌థ్యంలోనే కేర‌ళ అడ‌వుల్లో షూటింగ్ కోసం బ‌న్నీ వెళ్తుండ‌గా అర్హ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 




More Telugu News