కొనసాగుతున్న కేంద్ర బడ్జెట్ జోష్.. ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

  • 1,197 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 367 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 7.10 శాతం పెరిగిన ఎస్బీఐ షేర్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. నిన్న భారీ లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు... ఈరోజు కూడా దూకుడును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,197 పాయింట్లు పెరిగి 49,798కి ఎగబాకింది. నిఫ్టీ 367 పాయింట్లు లాభపడి 14,648 వద్ద స్థిరపడింది. ఈరోజు కూడా అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.10%), అల్ట్రాటెక్ సిమెంట్ (6.70%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (5.63%), ఎల్ అండ్ టీ (4.82%), భారతి ఎయిర్ టెల్ (3.54%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-2.34%), టైటాన్ కంపెనీ (-1.08%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.77%).


More Telugu News