పీవీకి భారతరత్న... రాజ్యసభలో ఎలుగెత్తిన టీఆర్ఎస్ సభ్యుడు
- పీవీకి భారతరత్న ఇవ్వాలని ఎప్పటినుంచో డిమాండ్
- రాజ్యసభలో ప్రస్తావించిన బండా ప్రకాశ్
- హెచ్ సీయూకి పీవీ పేరు పెట్టాలని విజ్ఞప్తి
- ఓ రహదారికి పీవీ పేరిట నామకరణం చేయాలని సూచన
దివంగత మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞావంతుడు పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. తాజాగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ సభ్యుడు బండా ప్రకాశ్ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అంతేకాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని, ఓ రహదారికి కూడా ఆయన పేరిట నామకరణం చేయాలని కోరారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చ సమయంలో బండా ప్రకాశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో వ్యాక్సిన్ పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.