53 ఏళ్ల క్రితం అంటార్కిటికాలో పోయిన పర్సు.. ఇప్పుడు యజమాని చెంతకు!
- ఆశ్చర్యపోయిన విశ్రాంత నౌకాదళ అధికారి
- 1967లో పరిశోధనల కోసం అంటార్కిటికాకు
- అక్కడే పర్సు పోగొట్టుకున్న వాతావరణ శాస్త్రవేత్త
- 2014లో అక్కడి స్టేషన్ ను కూల్చివేస్తుండగా దొరికిన పర్సు
- స్వచ్ఛంద సంస్థలు, సంఘాల సాయంతో అతడి దరికి
మనది అని రాసిపెట్టుంటే.. ఏ వస్తువైనా మనల్ని విడిచిపోదంటారు పెద్దలు. పోగొట్టుకున్నా వెతుక్కుంటూ వస్తుందని చెబుతుంటారు. అమెరికాకు చెందిన ఓ పెద్దాయన విషయంలో అది అక్షరాల నిజమైంది. 53 ఏళ్ల కిందట ఎక్కడో అంటార్కిటికాలో ఆయన పోగొట్టుకున్న పర్సు.. ఇప్పుడు ఆయన దగ్గరకు చేరింది. పర్సును చూసి షాక్ గురైన ఆ పెద్ద మనిషి.. తన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకున్నారు. ఆ కథేంటో చదివేయండి మరి...
పాల్ గ్రీషమ్.. ప్రస్తుతం ఆయన వయసు 91 సంవత్సరాలు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియేగోలో నివాసం. అమెరికా నౌకా దళంలో వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయ్యారు. డ్యూటీలో భాగంగా 1967 అక్టోబర్ లో ఆయన అంటార్కిటికాకు వెళ్లారు. 13 నెలల పని. అక్కడే ఉండాలి. మధ్యలో ఆయన పర్సు ఎక్కడో పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. లాభం లేదనుకుని వదిలేశారు. పని అయిపోయాక ఇంటికి తిరుగు పయనమయ్యే ముందు మళ్లీ ఓసారి పర్సు కోసం వెతికారు. అయినా దొరకలేదు. ఒట్టి చేతుల్తోనే ఇంటికి వచ్చేశారు.
అన్నేళ్ల క్రితం మాయమైన పర్సు ఇప్పుడు దొరకడంతో గ్రీషమ్ మురిసిపోయారు. ఆయన ఐడీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, నేవీ గుర్తింపు పత్రం, ఆయన ముద్దుగా ‘ద ఐస్’ అని పిలుచుకునే ఎన్నెన్నో ప్రశంసా పత్రాలు అందులో ఉన్నాయి మరి. అణు, జీవ, రసాయన దాడులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యల రిఫరెన్స్ కార్డు, బీర్ రేషన్ కార్డు, పన్ను పత్రాల వంటివి ఉన్నాయి.
ఎలా దొరికింది?
2014లో అంటార్కిటికాలోని రాస్ ఐల్యాండ్ లో ఉన్న మెక్ ముర్డో స్టేషన్ ను కూల్చివేశారు. అప్పుడు దొరికింది గ్రీషమ్ పోగొట్టుకున్న పర్సు. దానితో పాటు మరో వ్యక్తికి చెందిన ఓ బిల్ ఫోల్డ్ (ఫైల్) కూడా బయటపడింది. ఇండియానాలోని స్పిరిట్ ఆఫ్ 45 అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన బ్రూస్ మెక్ కీతో కలిసి స్టీఫెన్ డెకాటో, ఆయన కూతురు సారా లిండ్ బర్గ్ లు ఎంతో శ్రమించి గ్రీషమ్ చిరునామాను సంపాదించగలిగారు. ఆ పర్సును పోస్టు ద్వారా పంపించారు.
అయితే, వారికి ఈ పర్సు ఎలా దొరికింది అన్న ప్రశ్న రావొచ్చు. ఇంతకుముందు అంటార్కిటికాపై పరిశోధనలు నిర్వహించిన ఓ సంస్థలో డెకాటో పనిచేశారు. కొద్ది రోజుల క్రితం ఓ షాపులో ఓ వ్యక్తి పోగొట్టుకున్న బ్రేస్ లెట్ వివరాలను ఆన్ లైన్ లో పోస్ట్ చేయడం ద్వారా తిరిగి అప్పగించగలిగారు. ఆ పోస్టును చూసిన డెకాటో మాజీ బాస్.. వెంటనే డెకాటోకో ఫోన్ చేశారు. 2014లో స్టేషన్ కూల్చివేతలో దొరికిన పర్సు గురించి వివరించారు.
దీంతో మెక్ కీ, డెకాటో, లిండ్ బర్గ్ లు కలిసి ఎన్నెన్నో గ్రూపులను ఆరా తీశారు. చివరగా నౌకాదళ వాతావరణ సేవల సంఘాన్ని దీని గురించి అడిగారు. అక్కడే వారికి గ్రీషమ్ చిరునామా దొరికింది. ఎందుకంటే.. అందులో గ్రీషమ్ సభ్యుడు మరి. మొత్తానికి, మనదైన వస్తువు ఎన్నేళ్లయినా మన దగ్గరికే వస్తుందని గ్రీషమ్ విషయంలో రుజువైంది.