'ఆహా' ప్రేక్ష‌కుల‌కు అల్లు అరవింద్ లేఖ

  • ప్రేక్ష‌కుల‌ను 'ప్రియ‌మైన కుటుంబ స‌భ్యులు' అంటూ సంబోధన ‌
  • ఆహా అనేది ఓ పెద్ద కుటుంబం అయినందుకు హ‌ర్షం
  • ఆహా మొద‌టి వార్షికోత్స‌వం చేసుకుంటోందని లేఖ‌  
సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ప్రారంభించి ఏడాది పూర్త‌వుతోన్న సంద‌ర్భంగా ఆయ‌న ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఓ లేఖ‌ విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల‌ను ప్రియ‌మైన కుటుంబ స‌భ్యులు అంటూ సంబోధిస్తూ ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. 'అలా ఎందుకు అన్నానంటే ఈ రోజు ఆహా అనేది ఓ పెద్ద కుటుంబం అయినందుకు చాలా సంతోషంగాను, గ‌ర్వంగానే ఉంది. మీ ప్రేమ ఆద‌ర‌ణ వల్లే ఈ రోజు ఆహా మొద‌టి వార్షికోత్స‌వం చేసుకుంటోంది' అని ఆయ‌న పేర్కొన్నారు.

కాగా, ఆహాలో సినిమాలు, వెబ్ సిరీస్‌లే కాకుండా స‌మంత వంటి స్టార్ హీరోయిన్ వ్యాఖ్యాతగా ఇంట‌ర్వ్యూ కార్య‌క్ర‌మాల‌ను ఆహా నిర్వ‌హించి ఓటీటీకే కొత్త అర్థం చెప్పింది. మొట్ట‌మొద‌టిసారి పూర్తిస్థాయి తెలుగు భాష‌లో ఓటీటీని తీసుకొచ్చింది. ఆహా ఏడాది పూర్తి చేసుకుంటోన్న సంద‌ర్భంగా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు.  
      


More Telugu News