వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ పై ఎస్ఈసీ చర్యలు

  • జోగి రమేశ్ పై 3 పార్టీలు ఫిర్యాదు చేశాయన్న ఎస్ఈసీ
  • ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని రమేశ్ కు ఆదేశాలు
  • సభలు, సమావేశాలు, ప్రచారంలోనూ మాట్లాడరాదని స్పష్టీకరణ
  • చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశాలు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేశ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. జోగి రమేశ్ ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడరాదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. సభలు, సమావేశాలు, ప్రచారంలోనూ మాట్లాడకూడదని స్పష్టం చేశారు. తన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎస్ఈసీ తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జోగి రమేశ్ పై మూడు పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.


More Telugu News