1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుందట: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- లోకేశ్ తాను పప్పులకే పప్పని నిరూపించుకున్నాడు
- టీడీపీ పుట్టింది1982లో కదా చిట్టీ?
- మీ నాన్న స్వతంత్ర పోరాటం చేశానని చెప్పుకున్నాడు
- నీవు 78లోనే విశాఖ ఉక్కు కోసం పోరాడే ఉంటావు!
టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ అజ్ఞానంతో పలు వ్యాఖ్యలు చేశారంటూ విజయసాయిరెడ్డి చెప్పారు. టీడీపీ పుట్టింది 1982లో అయితే, 1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుందని ఆయన అంటున్నారని చురకలంటించారు.
'లోకేశ్ తాను పప్పులకే పప్పని నిరూపించుకున్నాడు. 1978లోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుందట. ఉద్యమాలు చేసిందట! టీడీపీ పుట్టింది1982లో కదా చిట్టీ? అవునులే, మీ నాన్న స్వతంత్ర పోరాటం చేశానని చెప్పుకున్నాడు. నీవు 78లోనే విశాఖ ఉక్కు కోసం పోరాడే ఉంటావు!' అని విజయసాయిరెడ్డి చురకలంటించారు.