అన్నాడీఎంకేలో అత్యున్నత పదవి నాదే: కోర్టులో శశికళ పిటిషన్

  • తమిళనాట ఆసక్తికరంగా మారిన రాజకీయాలు
  • పళని, పన్నీర్ లపై శశికళ పిటిషన్
  • తన కారుపై అన్నాడీఎంకే జెండాను పెట్టుకున్న శశికళ
కొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కూడా కొత్త పార్టీని స్థాపించి, ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. దివంగత జయలలిత నెచ్చెలి శశికళ జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయం మరింత ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా అన్నాడీఎంకేలో అత్యున్నత స్థానం తనదేనని ఆమె అంటున్నారు. అంతేకాదు అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు ఆమె కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు.

జయలలిత మరణం తర్వాత పార్టీ పగ్గాలను శశకళ చేపట్టారు. సీఎం పదవిని చేపట్టేలోగానే అవినీతి కేసులో ఆమె జైలుకు వెళ్లారు. ఆ తర్వాత పళనిస్వామి సీఎం కావడం, పన్నీర్ సెల్వం డిప్యూటీ కావడం జరిగిపోయాయి. ఆ తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి శశికళను తొలగించారు. ఆ తర్వాత పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పార్టీలోని అత్యున్నత పదవి తనదేనని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. మరోవైపు శశికళ కారుపై అన్నాడీఎంకే జెండా ఉండటం గమనార్హం.


More Telugu News