హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు: సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక
- చలానాతో సరిపెట్టబోము
- తొలిసారి పట్టుబడితే మూడు నెలలు లైసెన్సు రద్దు
- రెండోసారి పట్టుబడితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ పోలీసులు ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ చాలా మంది నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతూనే ఉంటారు. ప్రమాదం జరిగితే తలకి గాయమై ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా, తమకేం కాదనే ధోరణితో వ్యవహరిస్తుంటారు.
దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని హెచ్చరించారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతూ పట్టుబడితే చలానాతో సరిపెట్టబోమని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని చెప్పారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ తొలిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి పట్టుబడితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు. దీనిపై ఓ వీడియోనూ విడుదల చేశారు.