విపక్ష నేతలను, మేధావులను ఆ రెండు పార్టీలు అణచివేస్తున్నాయి: చింతా మోహన్

  • తాజా రాజకీయ పరిణామాలపై మాజీ ఎంపీ స్పందన
  • వైసీపీ, బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు
  • పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
  • జేసీ సోదరులను, అచ్చెన్నను రాజకీయ కక్షతో వేధిస్తున్నారని వ్యాఖ్యలు
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ స్పందించారు. సీఎం జగన్ కు పరిపాలనపై విజన్ లేదని అన్నారు. వైసీపీ, బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు విపక్ష నేతలను, మేధావులను అణచివేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తెలిపారు. జేసీ సోదరులను, అచ్చెన్నాయుడిని రాజకీయ కక్షలతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచి ఓట్లు అడగడం శోచనీయమని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.


More Telugu News