ఐరోపా వ్యాప్తంగా అతిశీతల వాతావరణం.. గడ్డకట్టుకుపోయిన నెదర్లాండ్స్

  • మైనస్ 20 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • గడ్డకట్టుకుపోయిన ఇజెల్మీర్ సరస్సు
  • ఇళ్లలోనే గడుపుతున్న జనం
ఐరోపా వ్యాప్తంగా  అకస్మాత్తుగా ఏర్పడిన అతిశీతల ప్రభావం నెదర్లాండ్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత దశాబ్దకాలంలోనే ఎన్నడూ లేనంతగా అక్కడి వాతావరణం చల్లబడింది. ఫలితంగా నెదర్లాండ్స్ గడ్డకట్టుకుపోయింది. రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఇజెల్మీర్ సరస్సు గడ్డకట్టుకుపోయింది. సరస్సు నుంచి 32 కిలోమీటర్ల మేర ఉన్న డ్యామ్ వరకు నీటిపై మంచు ఫలకాలు తేలుతున్నాయి. అక్కడి ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 20 డిగ్రీలకు పడిపోవడంతో జనం అల్లాడుతున్నారు. గడ్డకట్టే చలిలో బయటకు రాలేక ఇళ్లలోనే గడుపుతున్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అయితే, నైరుతి నుంచి క్రమంగా వేడి గాలులు వీస్తుండడం కొంత ఉపశమనం కలిగించే అంశం.


More Telugu News