రేపు సాయంత్రం నాని 'టక్ జగదీష్' టీజర్

  • సాయంత్రం 5.04 గంటలకు టీజర్ రిలీజ్
  • ఈ నెల 24న నాని పుట్టినరోజు
  • ఒకరోజు ముందుగా కానుక ఇస్తున్న చిత్రబృందం
నాని హీరోగా రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం 'టక్ జగదీష్'. ఈ చిత్రం నుంచి రేపు టీజర్ రిలీజవుతోంది. లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళ్లిన 'టక్ జగదీష్'పై నాని అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో మరోసారి ఆ మ్యాజిక్ రిపీటవ్వాలని ఆశిస్తున్నారు. కాగా 'టక్ జగదీష్' టీజర్ ను రేపు సాయత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

నాని పుట్టినరోజు ఈ నెల 24 కాగా, ఒకరోజు ముందే టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, ఇతర అప్ డేట్లు నాని స్క్రీన్ పెర్ఫార్మెన్స్ పై అంచనాలను అమాంతం పెంచేశాయి. దాంతో టీజర్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా తమ వంతు ప్రచారంతో మరింత ఉత్సుకత కలిగిస్తున్నారు. హరీశ్ పెద్ది, గారపాటి సాహు నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.


More Telugu News