ఇక ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ యోధులు... తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ నిర్ణయం
- పెరుగుతున్న సైబర్ నేరాలు
- అడ్డుకట్ట వేసేందుకు నడుం బిగించిన పోలీస్ శాఖ
- ప్రతి పీఎస్ లో కనీసం ఇద్దరికి సైబర్ శిక్షణ
- వివరాలు తెలిపిన డీజీపీ
టెక్నాలజీతో ఉపయోగాలు పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా అదేస్థాయిలో పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసు విభాగం చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే తొలిసారిగా సైబర్ వారియర్లను తయారుచేస్తోంది. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ కనీసం ఇద్దరికి లేదా గరిష్ఠంగా ఐదుగురి వరకు సైబర్ యోధులుగా శిక్షణ ఇవ్వనున్నారు. సైబర్ నేరాలను అరికట్టడం, ఈ తరహా కేసులపై సాంకేతికత సాయంతో విచారణ జరపడం, ప్రజల్లో అవగాహన కలిగించడం ఈ సైబర్ వారియర్ల విధి. దీనికి సంబంధించిన కార్యాచరణను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.