సముద్రంలోకి దూకి ఈతకొట్టిన రాహుల్ గాంధీ.. వీడియో ఇదిగో
- కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
- ఆ రాష్ట్రంలో రాహుల్ పర్యటన
- మత్స్యకారులతో పడవలో సముద్రంలోకి
- చేపల కోసం వల విసిరిన రాహుల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సముద్రంలో ఈతకొట్టారు. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజలతో మమేకమైపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ తమ పార్టీని బలపర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన కేరళలోని కొల్లాం తీరంలో నిన్న పర్యటించి, మత్స్యకారులతో మాట్లాడుతూ వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. వారితో కలిసి ఓ పడవలో సముద్రంలోకి వెళ్లి, చేపలను పట్టేందుకు వలను విసిరారు. అనంతరం మత్స్యకారులతో కలిసి పడవలోంచి సముద్రంలోకి దూకి ఈతకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.