మహారాష్ట్రలోని ప్రభుత్వ హాస్టల్ లో 232 మందికి కరోనా!
- ముగ్గురు సిబ్బంది, మిగతా వారంతా విద్యార్థులే
- కరోనా సోకిన వారిలో అమరావతికి చెందినవారే ఎక్కువ
- మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో కలకలం
- కంటెయిన్ మెంట్ జోన్ గా ప్రకటన
మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరిగిపోతున్నాయి. గురువారం రికార్డు స్థాయిలో 8,807 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా తగ్గుతోందన్న కారణంగా ఇటీవలే స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. వాటితోపాటే హాస్టళ్లూ తెరుచుకున్నాయి. ఎక్కడ తేడా కొట్టిందో గానీ.. 327 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఓ హాస్టల్ లో 200 మందికిపైగా కరోనా సోకి కలకలం రేపింది.
వాషిం జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో విద్యార్థులు, సిబ్బంది సహా 232 మందికి కరోనా సోకింది. అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారంతా విద్యార్థులేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ స్కూల్ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించారు.
పాజిటివ్ వచ్చిన విద్యార్థులంతా అమరావతి, హింగోలి, నాందేడ్, వాషిం, అకోలా, ముల్దానా ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అందులోనూ ఒక్క అమరావతికి చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని సమాచారం. వెంటనే పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని క్వారంటైన్ చేశారు.