పెళ్లి బ‌రాత్ నిర్వ‌హించిన‌ ద‌ళితులు.. రాళ్ల‌దాడికి పాల్ప‌డ్డ అగ్ర‌కుల‌స్థులు‌

  • గుజ‌రాత్‌, ఆరావ‌ళి జిల్లాలో ఘ‌ట‌న‌
  • పెళ్లి బృందానికి గాయాలు
  • 9 మందిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు
  • ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకోకుండా చ‌ర్య‌లు
ద‌ళితుల‌పై అగ్ర‌కులానికి చెందిన కొంద‌రు అహంకారాన్ని బ‌య‌ట‌పెట్టారు. ద‌ళితులంటే త‌మ‌కు ఎంత‌టి ద్వేష‌మో త‌మ తీరుతో తెలియ‌జెప్పారు. ద‌ళిత కుటుంబాల‌కు చెందిన అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుని, సంతోషంగా బ‌రాత్ లో పాల్గొంటున్నారు. ఇరు కుటుంబ స‌భ్యులు ఆనందంతో డ్యాన్సులు చేస్తూ వెళ్తుండ‌గా, అది చూసి అగ్ర‌కుల‌స్థులు ఓర్వ‌లేక‌పోయారు.

పెళ్లికొడుకు, పెళ్లికూతురు స‌హా డ్యాన్సులు వేసే వారిపై రాజ్‌పుత్ సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు రాళ్ల‌దాడికి పాల్ప‌డ్డారు. ద‌ళితులు ప‌గిడి ధ‌రించి, డీజే పాట‌లకు డ్యాన్సులు వేస్తారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో పెళ్లి బృందం గాయాల‌పాలయింది.

అగ్ర‌కుల‌స్థుల దాడిని చివ‌ర‌కు వ‌ధువు బంధువులు అడ్డుకున్నారు. దీంతో ద‌ళితులు అంద‌రూ ప‌గిడి తీయాల‌ని, డీజే ఆపాల‌ని అగ్ర‌కుల‌స్థులు బెదిరించారు. లేదంటే మ‌ళ్లీ దాడులు చేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో పోలీసులకు ద‌ళితులు ఫిర్యాదు చేశారు. గుజ‌రాత్ ఆరావ‌ళి జిల్లాలోని లించ్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. తొమ్మిది మంది రాజ్‌పుత్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఉద్రిక్త‌తలు చెల‌రేగ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు.


More Telugu News