బాక్సింగ్ నేర్చుకుంటున్న రాశిఖన్నా!

  • హిందీలో వెబ్ సీరీస్ చేస్తున్న రాశిఖన్నా 
  • షాహిద్ కపూర్ సరసన నాయిక పాత్ర
  • బాక్సింగ్ నేర్చుకుంటున్నది అందుకేనట!
అందాల కథానాయిక రాశిఖన్నా ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోను కూడా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఇదేదో సరదా కోసం ఈ చిన్నది కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం లేదు. ప్రస్తుతం తాను నటిస్తున్న ఓ వెబ్ సీరీస్ కోసం రాశి ఇలా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోంది.

ఆ విషయంలోకి వెళితే, ఇప్పుడు చాలామంది కథానాయికలు ఇటు సినిమాలు చేస్తూనే, అటు ఓటీటీ వేదికల కోసం వెబ్ సీరీస్ కూడా చేస్తున్నారు. కథానాయిక రాశిఖన్నా కూడా ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సీరీస్ చేస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సరసన ఆమె జంటగా నటిస్తోంది. ఈ సీరీస్ కోసమే తాను కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందని రాశి తాజాగా పేర్కొంది.

'ఓ వెబ్ సీరీస్ లో నటించడం ద్వారా చాలా రోజుల తర్వాత మళ్లీ బాలీవుడ్ కి వెళుతున్నాను. ఇందులో షాహిద్ కపూర్ తో కలసి నటించడం హ్యాపీగా వుంది. ఇందులోని పాత్ర కోసమే కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలా కిక్ బాక్సింగ్, వర్కౌట్స్ చేయడం వల్ల మరింత ఫిట్ నెస్ తెచ్చుకోవచ్చు' అని చెప్పింది రాశిఖన్నా.


More Telugu News