క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఘటన
- జేసీ బంధువు పెంట్ హౌస్ లో క్రికెట్ కిట్ల స్వాధీనం
- తాజాగా జేసీపై పలు సెక్షన్ల కింద కేసు
- జేసీ బంధువుపైనా కేసు నమోదు చేసిన పోలీసులు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనంతపురం జిల్లా తాడిపత్రిలో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో క్రికెట్ కిట్లను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తాడిపత్రి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతకుముందు గురువారం నాడు, బృందావనం అపార్ట్ మెంట్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి బంధువు గౌరీనాథ్ రెడ్డి పెంట్ హౌస్ లో పోలీసులు పెద్ద సంఖ్యలో క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై 188, 171-ఇ-హెచ్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అటు, జేసీ బంధువు గౌరీనాథ్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు. గౌరీనాథ్ రెడ్డి ఓ బ్యాంకు ఉద్యోగి.