శరత్ కుమార్ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా: సీనియర్ నటి రాధిక
- అన్నాడీఎంకే మమ్మల్ని కరివేపాకులా వాడుకుంది
- వచ్చే ఎన్నికల్లో ఎస్ఎంకే బలమేంటో చూపిస్తాం
- పొత్తుపై కమల హాసన్‌తో చర్చలు
శరత్‌కుమార్ ఆదేశిస్తే రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని సీనియర్ నటి రాధిక తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అన్నాడీఎంకే కూటమిలో తమను చిన్నచూపు చూశారని, కరివేపాకులా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త శరత్‌కుమార్ చాలా ధైర్యవంతుడని, రానున్న ఎన్నికల్లో ఎస్ఎంకే బలమేంటో నిరూపించి చూపిస్తామని సవాలు విసిరారు.
కాగా, చెన్నైలోని వేలాచ్చేరి కానీ, లేదంటే దక్షిణ తమిళనాడులోని ఉసిలంపట్టి స్థానాల నుంచి కానీ పోటీ చేయాలని రాధిక యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కమల హాసన్‌తో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్న ఎస్ఎంకే చీఫ్ శరత్ కుమార్.. కమల్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్టు చెప్పారు. పొత్తుపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. తమది థర్డ్ ఫ్రంట్ అని అందరూ అంటున్నారని, నిజానికి తమది ఫస్ట్ ఫ్రంట్ అని ఆయన పేర్కొన్నారు.