మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పెద్దన్న కన్నుమూత

  • ఇటీవలే 104వ పుట్టిన రోజు జరుపుకున్న ముత్తు మీరా  
  • రామేశ్వరంలో నేడు అంత్యక్రియలు
  • ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ గవర్నర్
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సోదరుడు ఏపీజే మహ్మద్ ముత్తు మీరా మరైకయార్ నిన్న కన్నుమూశారు. తమిళనాడులోని రామేశ్వరంలో స్వగ్రహంలోనే  ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆయన తన 104వ పుట్టిన రోజును జరుపుకున్నారు. నేడు అంత్యక్రియలు నిర్వహించనుండగా, ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని నివాసంలో ఉంచారు.

మరైకర్ మృతి విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు, తమిళ భాషల్లో సంతాపం తెలిపారు. కలామ్ అన్న ముత్తు మీరా మరైకయార్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కలాంతో ఆయన కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.


More Telugu News