ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- ఏబీని సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- సస్పెన్షన్ ను ఎత్తివేసిన ఏపీ హైకోర్టు
- పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సస్పెన్షన్ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆయన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ అంశంపై జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
వెంకటేశ్వరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేస్తుండటంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై జరుపుతున్న విచారణను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ధర్మాసనం ప్రశ్నకు బదులుగా ఆరు నెలల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ అంశానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పుడు... విచారణను ముగించడానికి అంత సమయం ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రోజువారీ విచారణను చేపట్టాలని... వచ్చే నెల 30లోగా విచారణను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.