సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • పూజ హెగ్డేకు భారీ పారితోషికం 
  • 'దృశ్యం 2'లో రానా గెస్ట్ పాత్ర?
  • హైదరాబాదుకొస్తున్న 'లైగర్'  
*  తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా వున్న అగ్రశ్రేణి కథానాయిక పూజ హెగ్డే తాజాగా తమిళంలో విజయ్ సరసన ఓ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో నటించడానికి గాను పూజ ఏకంగా 2.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.
*  ఇటీవల మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. వెంకటేశ్, మీనా జంటగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఇందులో రానా దగ్గుబాటి ఓ గెస్ట్ పాత్రను పోషించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
*  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్'  చిత్రం తాజా షెడ్యూలు గత కొన్నాళ్లుగా ముంబైలో జరుగుతోంది. అక్కడ కొవిడ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం చివరి షెడ్యూలును హైదరాబాదులో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.


More Telugu News