సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సాయిపల్లవి పాట సరికొత్త రికార్డు
- ఇటలీలో పాటలు పాడుతున్న 'ఖిలాడి'
- 'సలార్'లో ప్రత్యేక పాటలో 'కేజీఎఫ్' భామ
* శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో కథానాయిక సాయిపల్లవి డ్యాన్స్ చేసిన 'సారంగా దరియా' పాట యూ ట్యూబ్ లో ఊపేస్తోంది. తాజాగా ఇది సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో అతి వేగంగా 50 మిలియన్ వ్యూస్ ను పొందిన పాటగా రికార్డు కొట్టింది.
* రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అక్కడి అందమైన లొకేషన్లలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. రవితేజతో పాటు డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
* ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న 'సలార్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగులో నటించడానికి శ్రీనిధి శెట్టిని తీసుకున్నట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ సినిమాలో శ్రీనిధి కథానాయికగా నటించింది.