తమిళనాడులో 'ఎన్నికల రాజా'... ప్రముఖులపై పోటీ చేయడం ఆయన నైజం!

  • మెట్టూరు, ఎడప్పాడిలో నామినేషన్లు వేసిన పద్మరాజన్
  • పద్మరాజన్ ఓ టైర్ల రీట్రేడింగ్ వ్యాపారి
  • ఎన్నికలంటే విపరీతమైన ఆసక్తి
  • ఒక్కసారి కూడా గెలవని 'ఎన్నికల రాజా'
  • తాజాగా సీఎం పళనిస్వామిపై ఎడప్పాడిలో పోటీ
తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరుకు చెందిన 60 ఏళ్ల పద్మరాజన్ కు ఓ విశిష్టత ఉంది. ఆయనను అందరూ 'ఎన్నికల రాజా' అని పిలుస్తుంటారు. అందుకు చాలా బలమైన కారణమే ఉంది. టైర్ల రీట్రేడింగ్ వర్క్స్ నిర్వహించే పద్మరాజన్ కు రాజకీయాలంటే పిచ్చి. ఆయన ఇప్పటివరకు 216 సార్లు ఎన్నికల్లో నామినేషన్లు వేశారంటే నమ్మశక్యం కాదు.

తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెట్టూరు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసి తన విపరీత ఆసక్తికని చాటుకున్నారు. అంతేకాదు, సీఎం పళనిస్వామి పోటీ చేస్తున్న ఎడప్పాడి నియోజకవర్గంలోనూ పద్మరాజన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలే కాదు ఆఖరికి సహకార సంఘం ఎన్నికల్లోనూ పోటీ చేయడం ఈ పెద్దాయన నైజం. అయితే ఒక్కసారీ గెలిచింది లేదు.

ఎన్నికల్లో నామినేషన్లు వేసి ప్రముఖులపై పోటీకి దిగడం తనకిష్టం అని పద్మరాజన్ చెబుతుంటారు. అందుకే ఆయనను అందరూ 'ఎన్నికల రాజా' అంటుంటారు.


More Telugu News