నాపై అక్రమ కేసుల అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాను.. సాయం కోరాను: రఘురామకృష్ణరాజు
- రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వివరించాను
- ఆదాయానికి మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి
- నా నియోజకవర్గంలో నాపై అక్రమ కేసులు
లోక్‌సభలో తాను పలు విషయాలను ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశానని ఎంపీ రఘురామకృష్ణరాజు తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయానికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నానని తెలిపారు. అలాగే, తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న లోక్‌సభ నియోజక వర్గంలో తనపై పెట్టిన అక్రమ కేసుల గురించి ప్రస్తావించానని వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
'రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయానికి మించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గంలో నాపై పెట్టిన అక్రమ కేసుల అంశాన్ని పార్లమెంటులో వివరించి తగిన సహాయం చెయ్యాలని కోరడం జరిగింది' అంటూ రఘురామకృష్ణరాజు ట్వీట్ చేశారు.