గ‌వ‌ర్నర్‌తో జ‌రిగిన సంభాష‌ణ ఎలా లీక్ అయిందో విచారణ జరిపించండి.. హైకోర్టులో నిమ్మ‌గ‌డ్డ పిటిష‌న్

  • గ‌వ‌ర్న‌ర్‌తో పంచుకున్న అత్యంత కీల‌క స‌మాచారం లీక్
  • గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది
  • సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించాలని కోరిన నిమ్మగ‌డ్డ 
  • వేరే బెంచ్‌కు బ‌దిలీ చేస్తూ హైకోర్టు నిర్ణ‌యం  
గ‌వ‌ర్నర్ కు, త‌న‌కు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ లీక్ అయింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. గ‌వ‌ర్న‌ర్‌తో పంచుకున్న అత్యంత కీల‌క స‌మాచారం లీక్ అయింద‌ని చెప్పారు. ఆ స‌మాచారం గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు రావ‌డంపై సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించాల‌ని పిటిష‌న్ లో పేర్కొన్నారు.

ప్ర‌తివాదులుగా సీఎస్‌, గ‌వ‌ర్న‌ర్ ముఖ్య కార్య‌ద‌ర్శితో పాటు మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సను  చేర్చారు. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వేసిన పిటిష‌న్‌ను వేరే బెంచ్‌కు బ‌దిలీ చేస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది.

మ‌రోవైపు,  మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది త‌మ వాద‌న‌లు వినిపిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే పిటిషన్‌ దాఖలు చేయడం సరికాదని చెప్పారు.

ఎన్నికల పరిశీలన దశలోనే పిటిషన్‌ దాఖలు చేయడం తొందపాటు చర్య అని తెలిపారు. పరిషత్‌ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ పరంగా ఎస్‌ఈసీ బాధ్యత అని చెప్పారు. హైకోర్టు విచారణను ముగించి, తీర్పును రిజర్వు చేసింది.


More Telugu News