రామ్ చరణ్ ఉగ్రరూపం చూస్తారా... బర్త్ డే వరకు వేచిచూడండి: ఆర్ఆర్ఆర్ చిత్రబృందం
- రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం
- రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ చిత్రం
- ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే
- అభిమానులకు కానుక సిద్ధం చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందం\
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. అయితే మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేసేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఆ రోజున రామ్ చరణ్ మహోగ్రరూపాన్ని చూస్తారని చిత్రయూనిట్ వెల్లడించింది. రామరాజు వస్తున్నాడు... అంటూ ట్వీట్ చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్-అలియా భట్, ఎన్టీఆర్- ఒలీవియా మోరిస్ జంటలుగా నటిస్తుండగా, కీలకపాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్ చాలారోజులు నిలిచిపోగా, ప్రస్తుతం శరవేగంతో చిత్రీకరణ జరుపుతున్నారు.