ఎన్నికల సంఘానికి మమతపై బీజేపీ ఫిర్యాదు

  • ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు
  • ఆమెపై సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • మోదీ, భాజపా నాయకుల్ని దుర్యోధనుడు, దుశ్శాసనులతో పోల్చిన దీదీ
  • రాష్ట్రానికి బీజేపీని రానివ్వొద్దని ఓటర్లకు పిలుపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనాయకులపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు నేడు వారు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆమెపై సరైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈసీని కలిసిన వారిలో ఎంపీ, భాజపా రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు అర్జున్‌ సింగ్‌, సీనియర్‌ నేత శిశిర్ బజోరియా ఉన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖాన్ని బెంగాల్‌ ప్రజలు మళ్లీ చూడాలనుకోవడం లేదని శుక్రవారం తూర్పు మెదినీపుర్‌లోని ఎగ్రాలో ఎన్నికల సభలో మమతా బెనర్జీ అన్నారు. భాజపా నాయకులను ఆమె దుర్యోధనులు, దుశ్శాసనులతో పోల్చారు. రాష్ట్ర ప్రజలకు భాజపా అక్కర్లేదన్నారు. దేవుడు పేరు చెప్పి, భాజపా వెన్నుపోటు పొడుస్తోందని, పాన్‌పరాగ్‌ నమిలి ప్రజల నుదుటిపై తిలకం పెడుతోందని ఆమె విమర్శించారు.


More Telugu News