తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమిని విపక్షాలు ముందే అంగీకరించాయా?: విజ‌య‌సాయిరెడ్డి

  • వాలంటీర్ వ్యవస్థపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు
  • అలాంటి వారిపై పడి ఏడవడం మానుకోవాలి
  • ఎన్నిక‌ల్లో ఓడిపోయాక ఆ నిందను వారిపై మోపాల‌ని ఫిక్సయ్యారా?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొన‌సాగుతోన్న వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌పై ఆయ‌న ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. వారిని చూసి ఏడ‌వ‌డం మానుకోవాల‌ని విప‌క్షాల‌కు సూచించారు.

'ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది జగన్ గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ. అలాంటి అనుసంధానకర్తలపై పడి ఏడవడం మానుకోవాలి. తిరుపతి ఉపఎన్నికల్లో ఓటమిని విపక్షాలు ముందే అంగీకరించాయా? లేదా ఓడిపోయాక ఆ నిందను  వాలంటీర్లపై మోపాలని ఫిక్సయ్యారా?' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.



More Telugu News