చమురుపై ఆదాయం... పెరిగిందిలా...!

  • లోక్ సభలో వివరణ ఇచ్చిన కేంద్రం
  • పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపేణా భారీ ఆదాయం
  • భారీగా పెరిగిన సుంకాలు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.94 లక్షల కోట్లు
చమురుపై కేంద్రానికి లభించే ఆదాయం పట్ల లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ బదులిచ్చారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో పెట్రోల్, డీజిల్ పై కేంద్రానికి రూ.2.94 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు. గత 6 సంవత్సరాల్లో చమురుపై పన్నుల రూపేణా కేంద్రానికి లభించే ఆదాయంలో 300 శాతం వృద్ధి నమోదైందని వివరించారు.

2014లో  పెట్రోల్ ఒక లీటరుపై ఎక్సైజ్ సుంకం రూ.9.48 ఉండగా, ఇప్పుడది రూ.32.90కి చేరిందని వివరించారు. అదే సమయంలో డీజిల్ ఒక లీటరుపై రూ.3.56గా ఉన్న సుంకం నేడు రూ.31.80కి పెరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి లభించే మొత్తం ఆదాయంలో చమురు, గ్యాస్ పై లభించే ఆదాయం 2014-15లొ 5.4 శాతం ఉంటే 2020-21 నాటికి 12.2 శాతానికి చేరిందని పేర్కొన్నారు.


More Telugu News