ముంబైలో బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో 'లైగ‌ర్' టీమ్.. ఫొటోలు వైర‌ల్

  • పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్
  • ప్ర‌స్తుతం ముంబైలో షూటింగ్‌
  • క‌ర‌ణ్ జొహార్, మ‌నీశ్‌ మ‌ల్హోత్రా, సారా అలీ ఖాన్‌తో  ఫొటోలు
పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం 'లైగ‌ర్' అనే పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. అక్క‌డ‌ విజ‌య్ దేవ‌రకొండ, హీరోయిన్ అన‌న్య పాండేపై కీల‌క స‌న్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
      
ఈ నేప‌థ్యంలో ముంబైలో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, చార్మీ, అన‌న్య పాండే పార్టీ చేసుకున్నారు. క‌ర‌ణ్ జొహార్, మ‌నీశ్‌ మ‌ల్హోత్రా, సారా అలీ ఖాన్‌తో లైగర్ టీమ్‌ దిగిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పలు పోస్ట‌ర్లు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించాయి.


More Telugu News