కమల్ పార్టీ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు.. రూ. 10 కోట్ల నగదు స్వాధీనం

  • తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లేరోస్ మొరాయ్సి
  • ఇళ్లు, కార్యాలయాలపై రెండు రోజులపాటు దాడులు
  • పల్లవరం వద్ద కారులో తరలిస్తున్న రూ. 4 కోట్ల విలువైన బంగారం పట్టివేత
కమలహాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అభ్యర్థి, కమల్ సన్నిహితుడు అయిన లేరోస్ మొరాయ్స (45) ఇంట్లో ఐటీ అధికారులు రూ. 10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పారిశ్రామికవేత్త కూడా అయిన లేరోస్  ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోమవారం ప్రారంభించిన దాడులు నిన్న కూడా కొసాగాయి.

ఈ తనిఖీల్లో రూ. 10 కోట్ల నగదు, కోట్లాది రూపాయల విలువైన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో లేరోస్ తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

కాగా, చెన్నై పల్లవరం వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ. 4 కోట్ల విలువైన బంగారం, వెండి నగలు పట్టుబడ్డాయి. ఈరోడ్‌లో 4.5 కిలోల బంగారు ఆభరణాలను ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.


More Telugu News