కరోనా నేపథ్యంలో తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షల వాయిదా

  • రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • కీలక నిర్ణయం తీసుకున్న ఉన్నత విద్యా మండలి
  • పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని వ్యాఖ్య
కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్టు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని యూనివర్శిటీలకు సంబంధించిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు.


More Telugu News