వైయస్సార్ ప్రధాన అనుచరుడు సూరీడుపై అల్లుడి దాడి

  • క్రికెట్ బ్యాటుతో చితకబాదిన అల్లుడు సురేంద్రనాథ్ రెడ్డి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన సూరీడు కుమార్తె 
  • అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు సూరీడుపై హైదరాబాదులో దాడి జరిగింది. ఆయన అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి ఆయనపై దాడి చేశారు. జూబ్లీహిల్స్ లోని సూరీడు నివాసంలోకి బలవంతంగా చొరబడ్డ సురేంద్రనాథ్ రెడ్డి క్రికెట్ బ్యాటుతో ఆయనను చితకబాదారు. గత ఏడాది కూడా సూరీడుపై ఆయన దాడికి పాల్పడటం గమనార్హం.

ఆ వివరాల్లోకి వెళ్తే, భార్యను వేధిస్తున్నాడంటూ గతంలోనే సురేంద్రనాథ్ రెడ్డిపై గృహహింస కేసు నమోదైంది. ఆ కేసులను ఉపసంహరించుకోవాలని సురేంద్రనాథ్ పలుమార్లు ఒత్తిడి చేశారు. అయినప్పటికీ కేసులను ఉపసంహరించుకోకపోవడంతో దాడికి పాల్పడ్డారు. మరోవైపు సూరీడు కుమార్తె గంగాభవాని ఫిర్యాదుతో సరేంద్రనాథ్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. సురేంద్రను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.


More Telugu News