సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' సినిమా పోస్టర్ ను విడుదల చేసిన రామ్ చరణ్
- ప్రజాస్వామ్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా
- కీలక పాత్రను పోషిస్తున్న రమ్యకృష్ణ
- యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రామ్ చరణ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రామ్ చరణ్ విడుదల చేశాడు. 'ప్రభుత్వం ఉందనే భ్రమల్లో మనం బతుకుతున్నాం. ప్రభుత్వం అంటే ఏమిటో మనం ఇంకా కనుక్కోవాల్సి ఉంది' అని పోస్టర్ పై రాసి ఉంది. ఈ చిత్రం దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
భారత ప్రజాస్వామ్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. మరోవైపు ఈ పోస్టర్ పై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. పోస్టర్ ఎంతో ఆకట్టుకుందని చెప్పాడు. తన సోదరుడు సాయి ధరమ్ తేజ్, దేవా కట్ట, యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు.
పోస్టర్ ను విడుదల చేసిన రామ్ చరణ్ కు సాయి ధరమ్ తేజ్ ధన్యవాదాలు తెలిపాడు. పోస్టర్ ను లాంచ్ చేస్తావా? అని అడిగిన క్షణంలోనే ఓకే చెప్పేస్తాడని అనుకోలేదని చెప్పాడు. నీ సపోర్ట్ నాకు ఎంతో గొప్పదని కొనియాడాడు.