కరోనా తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన!
- బంగ్లాదేశ్‌కు వెళ్లడం సంతోషంగా ఉందన్న ప్రధాని
- బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవాల్లో పాల్గొననున్న మోదీ
- ముజిబుర్ రెహ్మాన్ శతజయంతి వేడుకల ప్రారంభానికీ హాజరు
- కరోనాపై బంగ్లాదేశ్ చేస్తున్న పోరాటానికి భారత్ సంపూర్ణ సహకారం
- ఈ నెల 26, 27 తేదీల్లో మోదీ బంగ్లాదేశ్ పర్యటన
కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆ దేశం వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో బంగ్లాదేశ్‌లో ఉండనున్నట్లు తెలిపారు. మహమ్మారి అనంతరం తొలి విదేశీ పర్యటనకు వెళ్లడం, అదీ పొరుగున ఉన్న మిత్రదేశమైన బంగ్లాకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఎంతో గాఢమైన సాంస్కృతిక, భాషా సంబంధాలు ఉన్నాయని ప్రధాని గుర్తుచేశారు.
శుక్రవారం బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రధాని తెలిపారు. దీంతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతజయంతి వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు. గత శతాబ్దంలోనే ఆయన మహానేత అని కొనియాడారు. ముజిబుర్ ఆలోచనలు, జీవితం కోట్లాది మందికి ప్రేరణగా నిలిచాయని తెలిపారు. తుంగైపరలోని బంగబంధు ముజిబుర్ సమాధిని సందర్శించి నివాళులర్పిస్తానని తెలిపారు.
దూరదృష్టి కలిగిన షేక్ హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ గొప్ప ఆర్థిక, అభివృద్ధి పురోగమనాన్ని ప్రశంసించేందుకు ఈ పర్యటన సూచికగా నిలుస్తుందని మోదీ తెలిపారు. అలాగే ఆ దేశ విజయాలకు భారత్ మద్దతు ఉంటుందని చెప్పనున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై బంగ్లాదేశ్ చేస్తున్న పోరాటానికి భారత్ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.