బంగ్లాదేశ్‌కు 1.2 మిలియన్‌ కరోనా టీకా డోసులు బహుమానంగా ఇచ్చిన మోదీ

  • అలాగే 109 అంబులెన్సుల తాళం చెవి అందజేత
  • బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాకు నేరుగా అందించిన మోదీ
  • ఇరు దేశాల మధ్య ఐదు అవగాహనా ఒప్పందాలు
  • భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆహ్వానం
బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశానికి 1.2 మిలియన్ల కరోనా టీకా డోసులు బహుమానంగా ఇచ్చారు. ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనాకు నేరుగా టీకా డోసుల బాక్సుని అందజేశారు. అలాగే 109 అంబులెన్సుల కానుకకు సూచికగా ఓ తాళం చెవిని కూడా ఆమెకు ఇచ్చారు.

అంతకుముందు భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఐదు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఉపయోగపడతాయని ఇరు దేశాల ప్రధానులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటన నేటితో ముగిసింది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా బంగ్లాదేశ్‌కు చెందిన 50 మంది పారిశ్రామికవేత్తలను  ప్రధాని మోదీ ఆహ్వానించారు. అంతకుముందు తుంగీపారాలోని ‘బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్’ సమాధి వద్ద నరేంద్రమోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.


More Telugu News