కుప్పం రెస్కోను ట్రాన్స్ కోలో విలీనం కానివ్వం: మంత్రి పెద్దిరెడ్డి
- ఏపీలో మూడు రెస్కోల విలీనానికి ఈఆర్సీ ఆదేశాలు
- కుప్పం రెస్కో విలీనంపై స్పందించిన పెద్దిరెడ్డి
- నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఈఆర్సీని ఆదేశిస్తామని వెల్లడి
- తిరుపతిలో తమదే విజయం అని ధీమా
ఏపీలోని మూడు రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ (రెస్కో)లను డిస్కంలలో విలీనం చేయాలని ఏపీఈఆర్సీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. చీపురుపల్లి, అనకాపల్లి, కుప్పం రెస్కోలు ఇకపై ఏపీఎస్పీడీసీఎల్ లో కలిసిపోనున్నాయి. అయితే, చిత్తూరు జిల్లా కుప్పం రెస్కోను ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాన్స్ కోలో విలీనం చేయబోమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈఆర్సీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇక, తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలపై ఆయన స్పందిస్తూ, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించారని, ఈ ఉప ఎన్నికలో ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి జాతీయస్థాయిలో చర్చకు వచ్చేలా తిరుపతిలో తమ విజయం ఉంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.