కరోనా టీకా తీసుకున్న రష్యా దేశాధినేత పుతిన్ కు స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్!

  • మంగళవారం కరోనా టీకా తీసుకున్న పుతిన్
  • మరునాడు ఉదయం కండరాల నెప్పులు
  • టీకా తీసుకున్న సమయంలోనే అసౌకర్యానికి గురైనట్టు వెల్లడి
  • ఏ టీకా వేశారో తెలియదన్న పుతిన్
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తుండడంతో వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగం కింద అనుమతులు ఇచ్చారు. అనేక దేశాల్లో అపోహలు ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. దేశాధినేతలు సైతం వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం నాడు కరోనా వ్యాక్సిన్ డోసు తీసుకోగా, ఆయనకు స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట. ఓ ఇంటర్వ్యూలో పుతిన్ స్వయంగా వెల్లడించారు.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రోజు ఉదయం కండరాల నొప్పులతో బాధపడ్డానని తెలిపారు. థర్మామీటర్ తో జ్వరం చూసుకుంటే సాధారణంగానే ఉందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కేంద్రంలోనే తాను కొద్దిగా అసౌకర్యానికి గురయ్యానని వివరించారు. తాను ఏ వ్యాక్సిన్ తీసుకున్నానో తెలియదని, తనకు ఏ వ్యాక్సిన్ ఇచ్చారో ఆ వైద్యుడికి మాత్రమే తెలుసని అన్నారు.


More Telugu News