రాత్రిపూట రైలు ప్రయాణమా.. అయితే, ముందే మీ మొబైల్‌ని ఫుల్‌ చార్జ్‌ చేయండి!

  • అగ్ని ప్రమాదాలు నివారించేందుకే ఈ నిర్ణయం
  • ఇటీవల ఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు
  • చార్జింగ్ పాయింట్లు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్
  •  చార్జింగ్‌ చేసే క్రమంలో మంటలు చెలరేగుతుండడమే కారణం
ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకొని అగ్నిప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వే విభాగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో రాత్రిపూట ప్రయాణికులు చార్జింగ్‌ పాయింట్లను ఉపయోగించకుండా చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల ఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో చార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది’ అని వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు.

ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు సహా ఇతరత్రా విద్యుత్తు పరికరాలకు రాత్రిపూట చార్జింగ్‌ పెట్టే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదవశాత్తు వాటి వల్ల రైళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో అన్ని రైల్వే జోన్లలో ఈ నిబంధనలను అమలు చేయాలని ఠాకూర్ యోచిస్తున్నారు.


More Telugu News