యడియూరప్పకు షాక్.. ఆపరేషన్ కమలపై విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- 2019లో సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ
- బీజేపీకి మద్దతు ప్రకటించిన కొందరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు
- దీని వెనుక అవినీతి ఉందన్న కాంగ్రెస్
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆపరేషన్ కమలను బీజేపీ చేపట్టిందనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ రెండు పార్టీల నేతలు తమ పార్టీల సభ్యత్వాలకు రాజీనామా చేసి, బీజేపీకి మద్దతు పలికారు. దీంతో, అనేక నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ అధికారపీఠంపై కూర్చొంది. యడియూరప్ప మరోసారి సీఎం పగ్గాలను చేపట్టారు.
ఆపరేషన్ కమల పేరుతో దీన్నంతా బీజేపీ నిర్వహించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం వెనుక అవినీతి ఉందని ఆరోపించారు. పార్టీ మారే ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామని హామీలు ఇచ్చారని... వాటికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆపరేషన్ కమలపై విచారణ జరిపించవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది.