తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

  • వాస్తవానికి ఈ నెల 7 నుంచి ప్రాక్టికల్స్
  • తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రం
  • థియరీ పరీక్షల తర్వాత ప్రాక్టికల్స్ నిర్వహణ
  • మే 29 నుంచి జూన్ 7 వరకు ప్రాక్టికల్స్
  • థియరీ పరీక్షల నిర్వహణపైనా అనుమానాలు
తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కూడా వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 7 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా వస్తున్న పరిస్థితుల్లో ప్రాక్టికల్స్ నిర్వహించకపోవడమే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది.

థియరీ పరీక్షల తర్వాత మే 29 నుంచి జూన్ 7 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు తాజాగా నిర్ణయించింది. కాగా, రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు ఇప్పటికే ఫీజులు కట్టేశారు. చివరి నిమిషంలో కరోనా కారణంగా ప్రాక్టికల్స్ వాయిదా వేసిన నేపథ్యంలో, థియరీ పరీక్షల నిర్వహణపైనా అనుమానాలు నెలకొన్నాయి.


More Telugu News