ఏపీ సీఎం జగన్ ను కలిసిన టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు

  • ఇటీవలే టీడీపీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు
  • మరోసారి బాధ్యతలు అందుకున్న వైనం
  • సీఎం జగన్ కు కృతజ్ఞతలు
  • సీఎంను విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులు
  • ధర్మాన్ని రక్షిస్తున్నారని కితాబు
పదవీ విరమణ చేసిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేయడంతో, రమణ దీక్షితులు తిరిగి టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు నేడు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. అర్చకుల వంశపారంపర్య హక్కులను కాపాడారంటూ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ ను ఘనంగా సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఇతర అర్చకులు కూడా సీఎంను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ ను మహావిష్ణువుతో పోల్చారు. ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరామని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడంలేదని, దేవస్థానం విషయాలను రాజకీయం చేయొద్దని హితవు పలికారు.


More Telugu News